శ్రీపాద శ్రీ వల్లభ జీవిత రహస్యాలు
(1) శ్రీ గురుచరిత్ర ను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీపాద శ్రీ వల్లభుల అసలు పేరు "శ్రీపాద శ్రీయ వల్లభ" గా తెలుస్తోంది. గురుచరిత్ర లో నరహరిశర్మ అనే భక్తుడు పారవశ్యంతో చెప్పిన శ్రీగురు అష్టకం / శ్రీ నృసింహ సరస్వతి అష్టకం లోని రెండవ మరియు మూడవ శ్లోకాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పై విషయం మనకు అవగతమవుతుంది.
ఆయతాక్ష పాహి శ్రీయ వల్లభేశ నాయకం
సేవ్యభక్త బృందవరద భూయో భూయో నమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [2]
|| చిత్తజారి వర్గషడ్క మత్త వారుణాంకుశం
సత్యసార శోభితాత్మ దత్త శ్రీయ వల్లభం
ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [3]
(2) శ్రీపాద శ్రీ వల్లభులు ఎవరో, వారి లక్షణాలు ఎలా ఉంటాయో, వారు ఏ రూపంలో ఉంటారో, వారు ఏ షోడస దత్తావతారము నుండి కలియుగంలో ఉద్భవించారో తెలిపే ప్రతి (పురాతన దత్తవతారాల పుస్తకం) RSS వ్యవస్థాపకులు స్వర్గీయ హెగ్డేవార్ కుటుంబీకుల వద్ద లభించింది. ఆశ్చర్యకరమైన విషయమేమీటంటే వల్లభేసుడిని చంపడం కోసం అతనితోపాటు కలిసివచ్చి శ్రీపాదుల వారి త్రిశూలమునకు బలి అయిన ముగ్గురు దొంగలు కుడా హెగ్డేవార్ కుటుంబము లోని ముందు తరాలవారని వారుకూడా వల్లభేసునికి స్వయానా బావమరుదులని, వ్యాపారంలో వచ్చిన ధనమును అన్నదానం కొరకు వెచ్చిస్తున్న బావ (వల్లభేసుడు) తో వచ్చిన మనస్పర్ధల కారణంగా చంపుటకు ప్రయత్నించినట్టు తెలిసింది. ఆ తరువాత శ్రీ పాదుని దయతో బతికిన 4వ వాని వల్ల శ్రీపాద మహిమ తెలుసుకున్న ఆ కుటుంబీకులు అప్పటి తరం నుండి నేటి తరం వరకు శ్రీపాదుడిని పూజిస్తున్నట్లుగా తెలుస్తోంది. (దయచేసి ఈ విషయాన్ని వివాదాస్పదం చేయవద్దని అభ్యంతరాలుంటే నాకు మెయిల్ చెయ్య మని మనవి - [email protected]) ఆ ప్రతి ప్రకారం శ్రీపాద శ్రీ వల్లభుల నామ ఆవిర్భావం క్రింది విధంగా ఉంది.
- కలియుగంలో దత్తాత్రేయుని మొట్టమొదటి అవతారమైన "శ్రీపాద శ్రీయ వల్లభ" పేరులో మొత్తం మూడు భాగాలు కలవు. వాటికి మూడు ముఖ్య అర్ధాలు కుడా కలవు.
- వాటిలో మొదటి భాగమైన శ్రీ పాద అని వచ్చుటకు కారణం వారి పాదపద్మములలోని "శ్రీ" చిహ్నాలు.
- రెండవ భాగమైన "శ్రీయ" అంటే సరస్వతి అని అర్ధం.నిఘూడంగా వారే శ్రీ నరసింహ సరస్వతి గా అవతరించబోతున్నట్లుగా తెలిపారు.
- ఇక మూడవ భాగమైన "వల్లభ" అనే నామం రావడానికి కారణం షోడస దత్తవతారాలలో ఒకటైన "యోగిజనవల్లభుడు".
శ్రీపాద శ్రీ వల్లభుల లక్షణాలు:
- మాతృగర్భం నుండి జ్యోతిస్వరూపంగా వెలువడ్డారు- ఇది కాలాగ్నిశమన లక్షణము
- లీలాబాలక రూపంలో (16 సం.) ఉన్న కలియుగ ప్రథమ దత్తావతారము - ఇది యోగిజనవల్లభ లక్షణము
Click Here To View Sources & Evidences