Unrevealed Secrets of Sripada

Click here to edit subtitle

శ్రీపాదుడు - సిద్ధగోళాలు (Sripada Vallabha - SiddhaGola)

శ్రీపాద శ్రీ వల్లభుల వారు "సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం" లో అనేక చోట్ల "నేను  సూక్ష్మరూపంలో వచ్చి మిమ్మలి ఆశీర్వదించెదను" అని అలాగే శ్రీపాద శ్రీ చరణుడు "తినుటకు ఏమైనా దొరుకుతుందేమో అని వంటింట్లోకి సూక్ష్మరూపంలో యధేచ్చగా పోయేదనని" 18వ అధ్యాయం లో వల్లభేశుని వృత్తాంతంలో చెప్పిరి. సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లో 4వ అధ్యాయం ప్రకారం శ్రీచరణుల వారికి మూడు రకములైన శరీరములు కలవు. అవి 1) స్థూలశరీరము 2) సూక్ష్మశరీరము మరియు 3) కారణ శరీరము  ఈ శరీరముల నుండి నిరంతరం వేలకొలది కిరణములు, కళలు వెలువడుచుండును. ముఖ్యంగా శ్రీపాదుల వారి స్మరణ జరిగేచోట లేదా వారి చెల్లెలైన వాసవాంబిక స్మరణ జరిగేచోట, సిద్ధమంగళ స్తోత్రం పఠించేచోట వారు సూక్ష్మశరీరముతో ఆయా ప్రదేశాలలో ఖచ్చితంగా ఉంటారు.

వారి ఉనికి, మనకు కాంతిని వెదజల్లే గోళాకార పుంజంగా కనిపిస్తుంది. ఈ గోళాకార కాంతిపుంజ సూక్ష్మశరీరమును కెమెరా కళ్ళు (కామ్రలెన్స్ - Camera Lens) శోషించుకొగలవు (Absorbe) మరియు వాటిని చిక్కించు (Capture) కొనగలవు. మానవ కంటికి కుడా సిద్ధగోళాలు కనిపిస్తాయి. వాటిని చూడడం కోసం కొంత సాధన అవసరం. మనం తరచుగా కళ్ళను ఆర్పుతుండడం వల్ల వాటిని చూడడం కొంత కష్టం. కానీ కొద్ది పాటి సాధనతో నేరుగా మన కంటితో కుడా సిద్ధగోళాలను చూడచ్చు. ఈమద్య కాలంలో వివిధ సంవత్సరాలలో వివిధ నెలలలో వివిధ తేదిలలో వివిధ ప్రదేశాలలో తీసిన ఫోటోలలో శ్రీ చరణుల వారు సూక్ష్మరూపంలో కాంతిపుంజము వలే దర్శనమిచ్చారు. ఇటువంటి శ్రీపాదుడి సూక్ష్మశరీర కాంతిపుంజములకు  స్వర్గీయ శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు "సిద్ధగోళాలు(SiddhaGolaas)" అని పేరు పెట్టారు.

ఈ సిద్ధగోళాల ఫోటోలన్నీ కుడా  శ్రీపాద శ్రీ వల్లభుల వారు మనతోనే ఉంటారన్నదానికి తిరుగులేని సాక్ష్యాలు. ఎంతో విలువైన ఈ ఫోటోలు కొన్ని విదేశీయుల ద్వారా తీయబడినవి. ఈ అరుదైన సిద్ధగోళ ఫోటోలను మీరు నిరభ్యంతరంగా కాపి చేసుకొండి. అందరికీ పంచండి, భక్తులందరితో షేర్ చేసుకొండి. సిద్ధగోళ ఫోటోలను చూసే ముందు సిద్ధగోళాలకు సంబందించిన సాహిత్యాన్ని(Literature), అవగాహనను పెంచుకొనుటకు క్రింది విషయాలను చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఫోటోలు తీసినవారితో  మీరు నేరుగా మాట్లాడవచ్చు లేదా వారికి మెయిల్ చెయ్యవచ్చు.
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే....
జై గురు దత్త
-కీర్తి వల్లభ
[email protected]
[email protected]
'సిద్ధగోళం' అంటే ?

గోళం వంటి శ్రీపాదుడి సూక్ష్మశరీర రూపమే 'సిద్ధగోళం'. ఇందులో శ్రీపాదుల వారితో పాటుగా లక్షా ఇరవై ఐదు వేల మంది సిద్ధులు కాంతి రూపంలో ఉంటారు. ఒక్కోసారి ఈ సిద్ధగోళాల లోపల  వివిధ ఆకృతులు  కూడా కనబడవచ్చు(శివలింగం, స్వామి సమర్ధ వారి రూపం మొదలైనవి). ఈ సిద్ధగోళాలు వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు ప్రదేశాలలో వేరు వేరు సమయాల్లో తీసిన ఫోటోలలో కనిపించినప్పటికీ  అవన్నీ ఒకేవిధమైన నిర్మాణాన్ని కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వివిధ ప్రదేశాలలో ఎవరెవరో తీసిన ఈ ఫోటోలలోని అన్ని సిద్ధగోళాలు ఒకేలా ఉంటాయి. కొన్ని  సిద్ధగోళాలను విస్తరించి చూస్తే "శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం" లోని 6వ అధ్యాయం ప్రారంభం లో చెప్పబడినట్లు గానే శ్రీచరణుల వారి సూక్ష్మశరీర కాంతి ఉండడాన్ని మనం  గమనించవచ్చు
సిద్ధగోళాలు ఎప్పుడు కనిపిస్తాయి?
సాధారణంగా సిద్ధగోళాలు ఈ క్రింది కార్యక్రమములలో తరచుగా కనిపిస్తుంటాయి.
  • సిద్ధమంగళ స్తోత్రం  పఠించేచోట
  • శ్రీపాదుల వారి చెల్లెలైన వాసవాంబిక స్మరణ జరిగేచోట
  • శ్రీపాదుల వారి గురించి సత్సంగాలు జరిగేచోట
  • బ్రహ్మ ముహూర్త సమయంలో కురువపురం కృష్ణానదీ తీర ప్రాంతములలో
  • బ్రహ్మ ముహూర్త సమయంలో కురువపురంకు దగ్గర గల నారదగుట్టలో
  • దత్తావధూతల రాక సందర్బంలో
  • శ్రీపాదుల వారి స్మరణ, భజన కార్యక్రమములలో
  • భక్తుల ఆహ్వానం మేరకు వివిధ శుభకార్యాలలో
  • సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం పారాయణలో (ఎప్పుడైనా)
  • ఋషిపంచమి రోజున (శ్రీపాద శ్రీ వల్లభ జయంతి / వినాయక చతుర్ధి తరువాతి రోజు) నదీసంగమ ప్రాంతాలలో
  • శ్రీపాదుని హారతిలో, హారతి సమయంలో సిద్ధగోళాల దర్శనం సర్వసామాన్యం
 సిద్ధగోళం ఫోటోలను ఎలా చూడాలి? / ఎలా గమనించాలి? - సిద్ధగోళాలను నేరుగా కంటితో ఎలా చూడాలి?
సిద్ధగోళాల JPGE ఫోటోలను గమనించేవారు ఆన్ లైన్ జూమ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించాలి. హార్డ్ కాపి ఫోటోలను గమనించేవారు సింపుల్ లెన్స్ ని వాడాలి.
సిద్ధగోళాలు ప్రతీ 8-10 సెకెన్లకి ఒకసారి బాగా కాంతిని వెదజల్లుతాయి, మరియు దిశను మార్చుకుంటాయి. కాబట్టి నేరుగా కంటితో చూడాలనుకునేవారు 10 సెకెన్ల కంటే ఎక్కువ సేపు కళ్ళను ఆర్పకుండాఉంచి చూడాలి. మన వెబ్సైట్ లో ఉన్న ఫోటోలను చూసేటప్పుడు కుడా కళ్ళు ఆర్పకుండా తీక్షణంగా సిద్ధగోళాలలోని లోపలి వలయాలను చూడాలి. నిజానికి శ్రీపాదుడి సమక్షంలో తీసిన చాలా ఫోటోలలో సిద్ధగోళాలు ఉంటాయి. కానీ మనం వాటిని గమనించమంతే!
సిద్ధగోళానికి ఉండే లక్షణాలు ఏంటి?
సాధారణంగా సిద్ధగోళాలకు క్రింది లక్షణాలు ఉంటాయి
  • సిద్ధగోళం  ఒక చోట స్థిరంగా ఉండదు.
  • సిద్ధగోళం వలయాకారంలో శ్రీ పాదుల స్మరణ చేసే వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
  • ఒక్కోసారి సిద్ధగోళం వలయాకారంలో శ్రీ పాదులవారి  చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
  • కొన్ని సిద్ధగోళాలు శ్రీ చరణుడి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
  • సిద్ధగోళాలు అన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ స్మరణ జరిగే ప్రాంతంలో తిరుగుతాయి.
  • ఒక్కోసారి ఒక పెద్ద సిద్ధగోళం చుట్టూ అనేక చిన్న సిద్ధగోళాలు తిరుగుతూ ఉంటాయి.
  • సిద్ధగోళం లోపలి వలయం తెలుపుగా, మధ్య వలయం నీలి, ఊదా రంగుల్లో, వెలుపలి వలయం కాషాయవర్ణం లోగాని, గులాబీవర్ణం లోకాని ఉంటుంది.
  • కొన్నిమహా సిద్ధగోళాలు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటాయి (స్వర్ణ సిద్ధగోళం). ఇటువంటి స్వర్ణ సిద్ధగోళాల చుట్టూ ఇతర సిద్ధగోళాలు తిరుగుతూ ఉంటాయి.
  • సిద్ధగోళ నిర్మాణం సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లో 6వ అధ్యాయం ప్రారంభంలో చెప్పినట్లుగానే ఉంటుంది.
  • ఒక్కోసారి లోపలి వలయంలో వివిధ ఆకృతులు (శివలింగం, స్వామి సమర్ధ, ఓం ), చిహ్నాలు కనబడవచ్చు.
  • సిద్ధగోళాల వెలుపలి వలయం పొగలు కక్కుతూ , కాంతిని వెదజల్లుతూ ఉంటుంది.
  • అన్ని సిద్ధగోళాలు దాదాపుగా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి (ఎవరు, ఎప్పుడు తీసినా, ఏ కామ్రా తో తీసినా)
  • ఒకే సంఘటనని ఒకే సమయం లో వివిధ వ్యక్తులు వివిధ కేమ్రాలతో తీసినా అందరి ఫోటోలలో ఒకేరకమైన సిద్ధగోళాలు వస్తాయి.
  • సిద్ధగోళాలకు చెట్ల కొమ్మల్లోంచి, వివిధ వస్తువుల్లోంచి, మనుషుల్లోంచి చోచ్చుకునిపోయే లక్షణం ఉంటుంది

ఏది సిద్ధగోళం? ఏది సిద్ధగోళం కాదు?
సిద్ధగోళం [√ ]
సిద్ధగోళం కాదు [X]
  • సిద్ధగోళం  ఒక చోట స్థిరంగా ఉండదు, అన్నివైపులకి తిరుగుతూ ఉంటుంది.
  • సిద్ధగోళాలకి వెలుపలి, మధ్య, లోపలి వలయాల అమరికలో, రంగుల్లో తేడా ఉంటుంది.
  • సిద్ధగోళాలు పగటిపూట, ఫ్లాష్ లేకుండా తీసిన ఫొటోల్లో కుడా కనిపిస్తాయి.
  • సిద్ధగోళాలు పొగలు కక్కుతూ , కాంతిని వెదజల్లుతూ స్వయం ప్రకాశంగా ఉంటాయి.
  • సిద్ధగోళాలు సాధారణ మానవుల కంటికి కుడా కనిపిస్తాయి.
  • సిద్ధగోళాలు అందరి (శ్రీపాద భక్తులు కానీ వారు తీసినా) కేమ్రాలతో తీసిన ఫోటోలలో వస్తాయి.
  • వివిధ కేమ్రా లతో ఒకే సమయంలో తీసిన ఒకే సంఘటన ఫోటోలని పోల్చి చూస్తే ఆ ఫోటోలలో వచ్చిన సిద్ధగోళాలు అన్నీ ఒకేరకంగా ఉంటాయి.
  • సిద్ధగోళాల ఫోటోలను ఎన్లార్జ్ చేసేకొద్దీ  లోపలి నిర్మాణాలు చక్కగా కనిపిస్తాయి.





  • కేమ్రా ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఏర్పడే కాంతిపుంజాలు సిద్ధగోళాలు కావు, ఇవి స్థిరంగా ఉంటాయి.
  • ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఏర్పడే కాంతిపుంజాలలో  ఉండే వలయాల మధ్య అమరికలలో,రంగుల్లో తేడా ఉండదు.
  • కేమ్రా ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఏర్పడే కాంతిపుంజాలు అన్ని ఫోటోలలో రావు.
  • కేమ్రా ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఏర్పడే కాంతిపుంజాలు పగటిపూట, ఫ్లాష్ లేకుండా తీసిన ఫొటోల్లో కనబడవు
  • కేమ్రా ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఏర్పడే కాంతిపుంజాలు స్వయం ప్రకాశాలు కావు, కేవలం లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఏర్పడినవి.
  • కేమ్రా ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఏర్పడే కాంతిపుంజాలు సాధారణ మానవుల కంటికి కనిపించవు
  • ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఏర్పడే కాంతిపుంజాలు అన్నీ ఒకే విధంగా ఉండవు
  • కేమ్రా ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఏర్పడే కాంతిపుంజాలను ఎన్లార్జ్ చేసేకొద్దీ బ్లర్ అవుతాయి.
"సిద్ధగోళాలు కాంతిపుంజాలే కాని అన్ని కాంతిపుంజాలు సిద్ధగోళాలు కావు"
మీదగ్గర  శ్రీపాదుడికి సంబంధించిన ఫోటోలలో సిద్ధగోళాలు ఉంటే ఏంచెయ్యాలి?
మీ దగ్గర ఉన్న శ్రీపాదుల వారి ఫోటోలలో సిద్ధగోళాలకు సంభందించిన ఆనవాళ్ళు ఉంటే వెంటనే మన ట్రస్ట్ కి వాటి సాఫ్ట్ కాపీలను మెయిల్ ద్వారా పంపండి. వాటితో పాటుగా ఫోటో వివరాలను (తేది,ఎక్కడ తీసారు వంటివి), మీ వివరాలనూ కుడా జత చేయండి. మాకు అందిన మీ ఫోటోలను మన ట్రస్ట్ లోని ముఖ్య సభ్యులు (సిద్ధగోళాలను నేరుగా చూసిన వారు) వాటిని పరిశీలించి మీకు తిరిగి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆపై మీ అనుమతి తో వాటిని మిగతా భక్తులకు షేర్ చేస్తారు.

సిద్ధగోళ ఫోటోలు (Photos of SiddhaGola)

ఫోటో # 1:
తేది: 2009
సందర్భం: స్వర్గీయ మల్లాది గోవింద దీక్షితులు గారు శ్రీపాద శ్రీ చరణుల వారి గురించి 2009 వ సంవత్సరంలో సత్సంగ్ జరుపుతుండగా కేమ్రా కంటికి చిక్కిన సిద్ధగోళం. ప్రక్కన ఉన్నది విస్తరిం చబడిన (Enlarged)  సిద్ధగోళం.
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri.Gnadhi Garu - 09704227863
వివరణ : -
ఫోటో # 2:
తేది: 15.March.2007
సందర్భం: పంచదేవపహాడ్ అనఘదత్త దేవాలయంలో అనఘ-దత్త విగ్రహాలను ఫోటో తీసినప్పుడు  కేమ్రా కంటికి చిక్కిన సిద్ధగోళం ప్రక్కన ఉన్నది విస్తరిం చబడిన (Enlarged)  సిద్ధగోళం. ఈ సిద్ధగోళంలో మనకి శివలింగాకారం స్పష్టంగా కనబడడాన్నిగమనించవచ్చు.
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri Venu Garu (Malkajgiri SPSV Temple Pujari) - [email protected] / 09440546238
వివరణ : శ్రీ వేణు గారు పంచదేవపహాడ్ వెళ్ళినప్పుడు మూసి ఉన్న అనఘదత్త దేవాలయంలో అనఘ-దత్త విగ్రహాలను తలుపు సందు లోంచి  ఫోటో తీసినప్పుడు వచ్చిన సిద్ధగోళం.
ఫోటో # 3:
తేది: 2010
సందర్భం: మల్కాజ్గిరి శ్రీపాద శ్రీ వల్లభులవారి గుడిలో సిద్ధమంగళ స్తోత్ర పఠించే సమయంలో కేమ్రా కంటికి చిక్కిన సిద్ధగోళం.
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri.Nanduri Sri Sairam Garu - [email protected] / 09963118716
వివరణ : ఈ ఫోటో తీసిన మర్నాడు ఉదయాన్నే ఎవరో ఒక మరాఠి భక్తుడు వచ్చి క్రింద కనిపిస్తున్న స్వామి సమర్ధ  పాకెట్ సైజ్ ఫోటోను ఇచ్చి వెళ్ళడం జరిగింది, అదేరోజు సాయంత్రం ఫోటోలోని సిద్ధగోళాన్ని గమనించి, పెద్దదిగా చేసి చూస్తే అందులో ఆ మరాఠీ అతను ఇచ్చిన ఫోటోలోని భంగిమ లోనే స్వామి సమర్ధ ఉండడం అతి ఆశ్చర్యకరమైన సంఘటన.
                                          
పైన ఫోటోలో ఉన్న సిద్ధ గోళాన్ని విస్తరించినప్పుడు సిద్ధగోళంలో కనబడిన స్వామి సమర్ధ రూపం
ఇప్పుడు బాగా విస్తరిం చబడిన (Enlarged) సిద్ధగోళ లోపలి వలయాన్ని గమనించండి. తన తొడలపై చేతులు పెట్టుకున్న స్వామి సమర్ధ తో పాటు ఇరువైపులా కూర్చుని, తలపాగాలు ధరించిన వ్యక్తుల రూపాలను కుడా గమనించవచ్చు.
                                   
ఫోటో # 4:
తేది: 21-11-2010
సందర్భం: పంచదేవపహాడ్ అనఘదత్త దేవాలయం పైన పున్నమి చంద్రుడి తోపాటుగా కనిపించిన సిద్ధగోళాలు . ప్రక్కన ఉన్నది విస్తరించబడిన (Enlarged) సిద్ధగోళం
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Srimathi & Sri Rama & Prakash - [email protected]
వివరణ : Srimathi & Sri Rama & Prakash గార్లు వారి కురువపురం ట్రిప్ లో భాగంగా పంచదేవపహాడ్ అనఘదత్త దేవాలయ సందర్శన అనంతరం ఆకాశంలో, అనఘదత్త దేవాలయం పైన పున్నమి చంద్రుడిని ఫోటో తీసినప్పుడు వచ్చిన సిద్ధగోళాలు
                                 
411% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం
ఫోటో # 5:
తేది: 31-01-2010
సందర్భం: కొంతమంది మహారాష్ట్ర మరాఠి భక్తులు 'బుట్టి' లో కురువపురం వెళుతుండగా వారితో పాటూ వారిని అనుసరించి వెళ్ళిన సిద్ధగోళం. ప్రక్కన ఉన్నది విస్తరించబడిన (Enlarged) సిద్ధగోళం
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri Sachdev Garu - 9948923455 / Keerthi Vallabha Mohan - [email protected]
వివరణ : 'బుట్టి' నడిపిన స్థానిక వ్యక్తి అందించిన సమాచారాన్ని బట్టి మహారాష్ట్ర మరాఠి భక్తులు ఇవతలి ఒడ్డులో బుట్టి ఎక్కింది మొదలు అవతలి ఒడ్డు (కురువపురం) లో దిగే వరుకు ఈ కాంతి గోళం కుడా బుట్టి కి ముందు మార్గదర్శకం గా ఉండి వారు కురువపురం గడ్డ మీదకాలు మోపగానే అదృశ్యం అయ్యిందట. ఈ ఫోటోను కుడా మహారాష్ట్ర మరాఠి భక్తుల రిక్వెస్ట్ మేరకు 'బుట్టి' నడిపిన స్థానిక వ్యక్తే తీసాడు.అతడిని మన ట్రస్ట్ సభ్యులు ఇంటర్వ్యూ కుడా చేసారు, రహస్య  సమాచారం ఎంతో సేకరిం చారు.
                               
343% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం
                          
ఫోటో # 6:
తేది: 21-05-2011 Afternoon 14:42
సందర్భం: కొంతమంది విదేశీయులు క్రియాయోగం గురించి తెలుసుకొని, మహావతార్ బాబాజీ గుహ అయిన రాణిఖేట్ గుహ సందర్శించినప్పుడు వారి కేమ్రాలకు చిక్కిన సిద్ధగోళాలు మరియు అద్భతమైన కాంతిపుంజం
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Mr. Williams Port - [email protected]
వివరణ : కొన్ని గ్రంధాల ఆధారంగా జీసేస్ క్రైస్ట్ హిమాలయాలలో ఉండే మహావతార్ బాబాజీ దగ్గర క్రియాయోగ సాధన చేసినట్లు తెలుసుకున్న విదేశీ క్రిస్టియన్ డీవోటీలు మహావతార్ బాబాజీ గుహలో ఫోటోలు దిగినప్పుడు వచ్చిన సిద్ధగోళాలు, ఇక రెండవ ఫోటోలోని కాంతి పుంజం నిజానికి బాబాజీ గుహలోకి వెళ్ళే మార్గంలో గల గోడను తీస్తే వచ్చింది.
                                    
194% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం
                                     
110% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  కాంతిపుంజం
                                
ఫోటో # 7:
తేది: 31-01-2010
సందర్భం: మరాఠి అనువాద సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంధావిష్కరణ కార్యక్రమ సందర్భం, పంచదేవపహాడ్
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : 1. Srimathi & Sri Rama & Prakash - [email protected]
                                                             2. Keerthi Vallabha Mohan - [email protected]
వివరణ : మరాఠి సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం (సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం - మరాఠి అనువాద గ్రంధ ఆవిష్కరణ) గ్రంధ ఆవిష్కరణ కార్యక్రమం పంచదేవపహాడ్ లో 31-01-2010 నాడు ఉదయం పూట జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు (ఫోటోలో కుడి వైపు సఫారి సూట్ వేసుకున్నవారు) మరియు మహారాష్ట్ర లోని నాశిక్ నుండి శివబాబా గారు వచ్చారు. మరాఠి సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంధావిష్కరణ కార్యక్రమంలో ఆద్యంతం స్వర్గీయ శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి చుట్టూ తిరుగుతున్న సిద్ధగోళాన్ని గమనించండి. మొదటి ఫోటోలో సిద్ధగోళం మల్లాది గోవింద దీక్షితులు గారి కుడి చేతికి - కుడి జేబుకి మధ్యలో ఉండడాన్ని గమనించండి.
ఈ ఫోటోలో సిద్ధగోళం మల్లాది గోవింద దీక్షితులు గారి కుడి చేతికి - కుడి జేబుకి మధ్యలోఉంది
229% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం.
ఈ ఫోటోలో సిద్ధగోళం మల్లాది గోవింద దీక్షితులు గారి కాలి దగ్గర ఉంది
169% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం.
ఈ ఫోటోలో సిద్ధగోళం మల్లాది గోవింద దీక్షితులు గారి ఎడమ చేతి వెనుక, దాదాపుగా కుర్చీ వెనక ఆనుకునే భాగంలో ఉంది
232% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం
చూసారా! పై మూడు ఫోటోలని జాగ్రత్తగా! సిద్ధగోళం ఏవిధంగా శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి చుట్టూ తిరుగుతోందో...! ఈ అన్నీ ఫోటోలు పొద్దున్న పూట ఫ్లాష్ లేకుండా / వాడకుండా సహజ కాంతిలో (Natural Day Light) తీసినవే!  ఈ అన్ని ఫోటోల ఒరిజినల్ ఫార్మాట్లు (కేమ్రా మెమరి కార్డు లో తీసినవి తీసినట్లుగా) కుడా మన దగ్గర ఉన్నాయి. అలాగే ఈ ఫోటోలన్నింటినీ దగ్గర పెట్టి చూస్తే సిద్ధగోళం తన చుట్టూ తాను తిరుగుతున్నట్లుగా కుడా గమనించవచ్చు.
                                        
ఫోటో # 8:
తేది: 16-03-2013 After Noon 14:22
సందర్భం: ప్రముఖ శ్రీపాద భక్తులు శ్రీ వి.సాయి కృష్ణ గారి అమీర్ పేట ఇంటికి శ్రీ విఠలానంద సరస్వతి స్వామి వారు వచ్చినప్పుడు కేమ్రాకి చిక్కిన సిద్ధగోళం
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri V. Sai Krishna Garu - 07760529900 / 09440475440, [email protected]
వివరణ : శ్రీ వి.సాయి కృష్ణ గారు శ్రీ విఠలానంద సరస్వతి స్వామి వారిని ఇంటికి ఆహ్వానించారు. శ్రీ విఠలానంద సరస్వతి స్వామి వారు ఇంటికి వచ్చి ధ్యానస్థితి లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలలో అన్నింటిలోనూ సిద్ధగోళం వచ్చింది. ప్రక్కన ఉన్నది విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం.
                             
ఫోటో # 9:
తేది: 2012
సందర్భం: రాఖీపౌర్ణమి రోజు శ్రీ వాసవాంబిక ఫోటో సమక్షంలో (ఫోటో ఎదురుగా) సిద్ధమంగళ స్తోత్రం పఠించేటప్పుడు శ్రీ వాసవీమాత హృదయం దగ్గర ఏర్పడ్డ సిద్ధగోళం
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Keerthi Vallabha Mohan - keerthivallabh[email protected]
వివరణ : పై ఫోటోలో (ఫోటో # 8 - 2013) ఏర్పడిన సిద్ధగోళం ఈ ఫోటోలో (ఫోటో # 9 - 2012)ఏర్పడిన సిద్ధగోళం ఆన్నివిధాలా పోలి ఉండడం ఆశ్చర్యమైన విషయం. ప్రక్కన ఉన్నది విస్తరిం చబడిన (Enlarged)  సిద్ధగోళం.
                                            
ఫోటో # 10:
తేది: 31-10-2011
సందర్భం: స్వామీ స్వరుపానంద మల్కాజ్గిరి శ్రీపాద దర్శనానికి వచ్చిన సమయంలో ఆయన హృదయం పై ఏర్పడిన సిద్ధగోళం. ప్రక్కన ఉన్నది విస్తరిం చబడిన (Enlarged)  సిద్ధగోళం.
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri Venu Garu (Malkajgiri SPSV Temple Pujari) - [email protected] / 09440546238
వివరణ : -
                                                
ఫోటో # 11:
తేది: 31-10-2011
సందర్భం: మల్కాజ్గిరి శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట - ప్రారం భోత్సవం రోజు ఏర్పడిన 'సిద్ధగోళాల వర్షం'
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri Venu Garu (Malkajgiri SPSV Temple Pujari) - [email protected] / 09440546238
వివరణ : ఈ ఫోటో అత్యంత అరుదైనది మరియు విలువైనది. శ్రీ చరణుల వారి గుడి ప్రారంభోత్సవం రోజున అనేక మందికి ఇక్కడ సిద్ధగోళాలు కనిపించాయి.  ఫోటోలు తీసినప్పుడు ఈ సిద్ధగోళాలతో పాటుగా గుడి పైన ఒక మహా సిద్ధపురుషుడు కాషాయ వస్త్రధారియై నిలబడి పర్యవేక్షిస్తున్నట్లు కూడా వచ్చింది. నేరుగా తమ కంటితో సిద్ధగోళాలను చుసిన వారు కుడా ఈ సిద్ధపురుషుడిని చూడలేదని చెప్పారు. కానీ కేమ్రా కంటికి చిక్కిన అనేక ఫోటో లలో ఈ సిద్ధపురుషుడి ఆనవాళ్ళు కనిపించాయి. చాలా ఫోటోలలో సిద్ధగోళాలు గుడి చుట్టూ, ఔదుంబరం చుట్టూ తిరుగుతున్నట్టుగా వచ్చాయి. ఇంకొక విశేషమేమిటంటే ఈ కార్యక్రమానికి అత్యంత అరుదైన బంగారువర్ణపు సిద్ధగోళం (స్వర్ణ సిద్ధగోళం) కుడా వచ్చింది. ఈ స్వర్ణ సిద్ధగోళాన్ని సిద్ధగోళాల కేంద్రకంగా చెప్పవచ్చు .
                                
SG = సిద్ధగోళాలు
MM = మల్కాజ్గిరి శ్రీ పాద శ్రీ వల్లభ స్వామీ వారి దేవస్థానం ప్రతిష్ట  మరియు ప్రారంభోత్సవం రోజు గుడి పైన నిలబడి వీక్షిస్తున్న ఒక మహాసిద్ధముని
OT = ఔదుంబర వృక్షం
55% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళాలు
ఔదుంబర వృక్ష కొమ్మలోంచి వెళుతున్న సిద్ధగోళం -236% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం
236% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళం
236% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళాలు
236% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged)  సిద్ధగోళాలు
బంగారువర్ణంలో మెరుస్తున్న స్వర్ణసిద్ధగోళం (అతి అరుదైన సిద్ధగోళం, ఇది ఒక రకంగా అన్ని సిద్ధగోళాలకి కేంద్రకం లాంటిది) -
236% పెద్దదిగా విస్తరించబడిన (Enlarged) స్వర్ణసిద్ధగోళం
                                            
ఫోటో # 12:
తేది: 2012
సందర్భం: మల్కాజ్గిరి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి దేవాలయ వార్షికోత్సవం రోజు కనిపించిన సిద్ధగోళాలు
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri Venu Garu (Malkajgiri SPSV Temple Pujari) - [email protected] / 09440546238
వివరణ : -
                                                             
ఫోటో # 13:
తేది: 16-10-2011
సందర్భం: శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి భక్తుల నూతన గృహ ప్రవేశం రోజున కనిపించిన సిద్ధగోళం
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri Venu Garu (Malkajgiri SPSV Temple Pujari) - [email protected] / 09440546238
వివరణ : -
                                                                      
ఫోటో # 14:
తేది: 16-10-2011
సందర్భం: శ్రీ పాదుల భక్తుల ఇంట జరిగిన ఒక శుభకార్యంలో కనిపించిన అతి స్పష్ట మైన, వెలుపలి వలయం నుండి పొగలు కక్కుతున్న సిద్ధగోళం
సంప్రదించవలసిన వారి పేరు, ఫోన్ / మెయిల్ : Sri Venu Garu (Malkajgiri SPSV Temple Pujari) - [email protected] / 09440546238
వివరణ : అతి అరుదైన, స్పష్ట మైన సిద్ధగోళం ఫోటో ఇది.

మీకు సిద్ధగోళాలని, మహా సిద్ధపురుషులని చూడాలని ఉందా?
అన్నింటినీ మీ కేమ్రాలలో బంధించాలని ఉందా?


సిద్ధగోళాలను, సిద్ధపురుషులను అన్వేషించే బృందంతో కలవండి


Day: 10-09-2013 ఋషిపంచమి రోజు (ఆర్ద్రరాత్రి)
Place : తంగిడి - నివృతిసంగమం

పేరు నమోదు మరియు వివరాలకు సంప్రదించండి
 శ్రీ వి.సాయికృష్ణ  - 07760529900 / 09440475440, [email protected]