దత్తాత్రేయుడు యోగవిద్యకు అధిదేవత, గురు పరంపరకు ఆద్యుడు. అసలు దత్తాత్రేయుడే చాలా ఆశక్తికరమైన దేవతావతారం. ఇంకా చెప్పాలంటే దత్తాత్రేయుడు
శ్రీ మహావిష్ణువు యొక్క ఆశక్తికరమైన అవతారము. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే దత్తాత్రేయుడు దేవుడా? (పరబ్రహ్మమా?) లేక దేవుని అవతారమా? ( పరబ్రహ్మ అవతారమా?) అని...
కొన్ని పరిశోధనాత్మక గ్రంధాలను పరిశీలించిన తరువాత తెలిసిందేంటంటే దత్తాత్రేయుడు పరబ్రహ్మే కానీ పరబ్రహ్మ కాదు , "పరబ్రహ్మ ప్రత్యేకతలు" కలిగిన "పరబ్రహ్మ అవతారము"తెలిసింది. అప్పుడు మళ్లీ అనేక సందేహాలు పుట్టాయి. వాటిలో ప్రదానమైనది దేవుడికి దేవుని అవతారానికి ఉన్న తేడా (పరబ్రహ్మకీ, పరబ్రహ్మ అవతారానికీ) ఏంటని? మళ్లీ అనేక గ్రంధాలను పరిశీలించిన తరువాత, అనేక మంది యోగులతో మాట్లాడిన తరువాత కొద్ది మొత్తంలో సమాచారం దొరికింది.
ఆ సమాచారం ఉన్నది ఉన్నట్లుగా .
సృష్టి, స్థితి మరియూ లయము ఇవన్నీ రూపరహితుడైన దేవుడే చేయాలి. అవి చేయడానికి ఒక్కో గుణాన్ని స్వీకరించి ఒక్కో రూపంలో భక్తులద్వారా వర్ణింప బడతాడు. రజోగుణం అనేది ప్రవృత్తిలోకి తీసుకెళ్తుంది కనుక సృష్టి చేయాలంటే రజోగుణం కావాలి. తాను సృష్టి చేసేటప్పుడు రజోగుణాన్ని ప్రధానంగా తీసుకొని సృష్టి కార్యాన్ని నడిపిస్తాడు. లయం చేయాలంటే తమోగుణం కావాలి, కనుక లయం చేసేటప్పుడు తమోగుణాన్ని ప్రధానం చేసుకొని కార్యాన్ని నడిపిస్తాడు. స్థితి లేదా రక్షణ చేయాలంటే సత్త్వగుణం కావాలి. సత్త్వం అనేది మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా చూపించగలదు, అది నిర్మలంగా ఉంటుంది. రక్షణ చేసేటప్పుడు పక్షపాతం ఉండకూడదు. ఏ ప్రలోభాలకు లొంగకుండా కేవలం తనకుండే అనంతమైన,సహజమైన జ్ఞానంతో, ఎవరెవరికి ఏవేవి తగునో అవి ఇస్తూ, అవసరం లేని వాటిని తొలగించడం చేయాలంటే నిశ్పాక్షికమైన బుద్ధి ఉండాలి. అలాంటిది సత్త్వం వల్లనే సాధ్యం కనుక, అది ప్రధానం చేసుకొని స్థితికార్యాన్ని సాగిస్తాడు పరబ్రహ్మ.
దత్తాత్రేయ అవతార ఆవిర్భావం & ప్రత్యేకత (అసలైన పరిశోధనాత్మక వివరణ)
ఈ చరాచర సృష్టిలో ఎవరికి అంతుచిక్కని (దేవతలకు సైతం) పరబ్రహ్మతత్వాని గురించి తెలుసుకొనుటకు కృతయుగములో ఋషులందరూ కలసి సామూహికంగా పరబ్రహ్మ కొరకై తపస్సు చేసారు. అందుకనే ఆకాలానికి "కృతయుగం" అని పేరు వచ్చింది. కృతము అనగా తపస్సు. అందరి తపస్సులలో ఒకానొక మహాముని (అప్పటికి ఇంకా అత్రి మహాముని అని పేరు పెట్టబడలేదు) తపస్సు యోగ్యమైనందువల్ల పరబ్రహ్మ అతనికి సాక్షాత్కరించదలచెను. సాక్షాత్కరించుటకు ముందు పరబ్రహ్మ ఆ మహామునిని పరీక్షింపదలచి రూపరహితుడు, నిరాకారుడు అయిన పరబ్రహ్మ యొక్క మూడు భాగాలు కావాలని రూపుధరించి మూడు రూపాలలో విడివిడి గా ఆ మహాముని ఎదుట నిలిచాయి. వారే పరబ్రహ్మ అనీ, సృష్టి-స్థితి-లయ కారకులుగా పరిచయం చేసుకొన్నాయి. అంతట ఆ మహాముని పరబ్రహ్మ ఏకపదార్ధమని,ఏకస్వరూపమని విడివిడిగా ఉండే పరబ్రహ్మ తనకు అవసరంలేదని సున్నితంగా వారితో చెప్పి వారిని నిరాకరిస్తాడు. అప్పటినుండి ఆ మహాముని "అత్రి" అని పిలవబడ్డాడు. (అ = నిరాకరించిన / ఒప్పుకోని, త్రి = ముగ్గురు - పరబ్రహ్మని ముగ్గురిగా ఒప్పుకోని మహామునే 'అత్రి' మహాముని ). అంతట పరబ్రహ్మ అత్రి మహాముని వేదజ్ఞానానికి సంతోషించి, ముగ్గురుగా ఉన్న పరబ్రహ్మ అదృశ్యమై ఏకరూపంగా అత్రికి సాక్షాత్కరించింది. అప్పటివరకూ రూపమేలేని పరబ్రహ్మ రూపుధరించి, అందునా ఏకరూపంగా సాక్షాత్కరించడంతో అచ్చెరువొందిన అత్రి మహాముని "దత్తః దత్తః" అని ఆనందంతో అరిచెను. దత్తః అంటే కనిపించింది, దొరికింది లేదా చిక్కింది అని అర్ధం (మనం ఏదైనా సాధించినప్పుడు సంతోషం తో "యాహూ" అనో, హుర్రే అనో, గాటిట్ అనో, సక్సెస్ అనో అరుస్తాము కదా! అలాగే). రూపుధరించిన ఆ రూపరహిత నిరాకార పరబ్రహ్మను చూసిన అత్రి మహాముని అచ్చంగా అన్నివిధాలా (రూప మరియు గుణ లక్షణాలలో) అటువంటి పుత్రుడినే కోరికగా కోరతాడు. ఆవిధంగా పరబ్రహ్మ అత్రి మహామునికి దిరికిపోయాడు.
ఆ కోరికకు సంతోషించిన పరబ్రహ్మ అత్రి మహాముని తో "అచ్చంగా అన్నివిధాల నన్ను పోలిన పుత్రుడు నేనే తప్ప మరెవరూ లేరని చెప్పి తనకు తానుగా
ప్రత్యేకతలను ఆపాదించుకున్న అవతారమూర్తిగా, మీ తనయునిగా పుడతానని" వరమిస్తారు. ఆ వరప్రసాదమే దత్తాత్రేయుడు. ఆ విధంగా పరబ్రహ్మ అత్రి మహాముని యొక్క వేదజ్ఞానాన్ని పరీక్షింపదలచి వచ్చి తనకు తానే చిక్కుకుపోయాడు (దత్తం). ఈ యదార్ధ ఘటన 200 కోట్ల సంవత్సరాల క్రితం (200,00,00,000 సంవత్సరాల క్రితం) జరిగింది.
దత్తబ్రహ్మము యొక్క అవతారము అతి రహస్యముగా, అతి సామాన్యముగా ఉంటుంది. ఎంత రహస్యమూ, సామాన్యమూ అంటే మానవులకే కాదు దేవతలు, ఋషులకు సైతం ప్రకటితం కాకుండా ఉంటుంది. కనపడని వియోగమే విలువైనదని, వియోగంలోనే భక్తి పరాకాష్టకి చేరుతుందని దత్తాత్రేయుల వారు తరచుగా చెబుతుంటారు. ఈ విధమైన పరిస్థితులలోనే భక్తుల యొక్క నిజమైన భక్తి, ప్రేమలను దత్తబ్రహ్మము గమనిస్తారు.
దత్తాత్రేయుడు - శ్రీ కృష్ణుడు
ద్వాపరయుగంలో దత్తాత్రేయుని షోడశకళలతో ఏర్పడిన పరిపుర్ణావతారమే శ్రీకృష్ణ అవతారము. అందువల్లనే దత్తాత్రేయునికి శ్రీకృష్ణునికి మధ్య ఎన్నో పోలికలు ఉంటాయి. శ్రీకృష్ణుని నిర్యాణము అనతరం కలి ప్రవేశించినది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీ.పూ. 3102 సంవత్సరం ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం, అశ్వనీ నక్షత్రంలో జరిగింది. ఇప్పటి నూతన కేలండర్ ప్రకారం BC 3102 ఫిబ్రవరి 18వ తేది న అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాల 30 సెకెండ్లకు .శ్రీ కృష్ణ నిర్యాణము జరిగింది (18/02/3102 BC - 02:27:30). శ్రీ దత్తాత్రేయుడు,శ్రీ కృష్ణుడు మాత్రమే 'గో' సమేతులు.ఇరువురూ త్రైలోక్య గురువులే, ఇరువురూ త్రిముర్త్యాత్మకులే.దత్త పరబ్రహ్మవలె శ్రీకృష్ణుడు కుడా 'గో' ప్రియుడు, శ్రీకృష్ణునివలె దత్త పరబ్రహ్మ కుడా 'ప్రేమ' తత్వాన్ని ఆస్వాదించే శాంతి సముద్రుడు. ఇరువురికీ మార్గశీర్షమాసమంటే ఇష్టం. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ కృష్ణుడు ఇరువురూ రాశిచక్రంలో దాదాపుగా ఒకే స్థానములో, ఒకే రాశి అయిన 'వృషభరాశి' లో ఆవిర్భవించారు. అందువల్లే దత్తాత్రేయ అనుష్టుప్ మంత్రములో " దత్తాత్రేయ హరే కృష్ణా......" అని చెప్పబడినది. అదే విధంగా దత్తాత్రేయుని షోడశ దత్తావతారములలో చివరదైన "శ్యామ కమలలోచనుడు" అన్నివిధాలా శ్రీ కృష్ణుని పోలి ఉంటాడు.దత్తాత్రేయుడు ఎన్నో సందర్భాలలో శ్రీకృష్ణుని యొక్క సఖియైన 'రాధ' యొక్క భక్తిని, ప్రేమను గుర్తు చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వాపరయుగంలో రాధ యొక్క భక్తి, ప్రేమ పారవస్యాలు మిగతా అన్ని యుగాలలో దత్తాత్రేయుడు గుర్తుచేస్తుంటారు. దత్తాత్రేయుడు అవతారమును చాలించుకోనతలచినప్పుడు రాధ యొక్క స్థితిని స్మరిస్తారట! ఆవెంటనే దత్తాత్రేయుని ప్రాణములు పోతాయట! రాధస్మరణ ఆయనను తాకగానే శాంత సముద్రుడైన ఆయన అల్లకల్లోలంగా అయిపోతారట! ప్రళయకాలములో సర్వజీవుల మరణ వేదనలను ఆయన అవలీలగా తట్టుకొనగలరట! కానీ 'రాధాహృదయ భక్తి వేదనను' తట్టుకొనే శక్తిలేక ఆయన ప్రతీ అవతారశరీరమూ రాలిపోతుందట! ఎంతటి ఆశ్చర్యము! దత్తాత్రేయుడేనా ఈ మాటలు పలికింది అనిపిస్తుంది. మరీ విడ్డూరంగా 'రాధా భక్తి రసాన్ని' విదేశీ మద్యంతో పోల్చి చెబుతారు శ్రీ దత్తస్వామీ. రాధ యొక్క భక్తి గురించి వారు చెప్పినది ఉన్నది ఉన్నట్టుగా మీకోసం... చదవండి...
శ్రీకృష్ణ శ్యామకమలలోచనుడు (దత్తాత్రేయుని షోడశావతారం)
సభూమిం విశ్వతో వృత్వా అత్యంతిష్ట దశాంగుళం II
1. హిరణ్యగర్భ భాగము - సృష్టి (బ్రహ్మ అని అంటారు), 2. నారాయణ భాగము - స్థితి (విష్ణు అని అంటారు), 3. రుద్రభాగము - లయ (మహేశ్వరుడు అని అంటారు) అలాగే 1. భూలోకము. 2. భువర్లోకము. 3. సువర్లోకము. 4. మహాలోకము. 5. జనలోకము. 6. తపోలోకము. 7. సత్యలోకము. క్రింది దశాంగుళ దత్తాత్రేయ సంకేత చిత్రములో చివరగల మూడు బిందువులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాగా వాటి నడుమన గల వృత్తాకారం లోని ఆరు బిందువులు, మధ్యలో గల ఒక బిందువు కలిపి మొత్తం ఏడు బిందువులు ఏడు లోకములకు చిహ్నాలు. ఇదే ఒకప్పటి ప్రాచీన దత్తాత్రేయుని చిత్రము. కేవలం చుక్కలతో ఉండే ఈ సంకేత చిత్రం చాల శక్తివంతమైనదిగా నిరూపించబడినది. ఈ దత్తాత్రేయ సంకేత చిత్రాన్ని మనసుతో చూస్తూ ధ్యానించడం ప్రాచీన ఆచారము.
కూర్చునిఉన్న ఏకముఖ ద్విభుజ దత్తాత్రేయుడు
ఏకముఖ షట్భుజ దత్తపరబ్రహ్మ
ఉత్తరరామేశ్వరం లో గల ఏకముఖ షట్భుజ సిద్ధాసన దత్తాత్రేయుడు
పంచముఖ అష్టభుజ దత్తపరబ్రహ్మ
తానే తానే ఇందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ | ప్రపన్నులకు బుద్ధి పచరించి|
తపముగా ఫల పరి త్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
తానే తానే ఇందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి |
ఉన్నతపదమున కొనరంగ కరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
తానే తానే ఇందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
తనరగ కపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వనరగ సంసార యోగము కృపసేయు | అనిమిష గతులను అభ్యాసయోగి ||
తానే తానే ఇందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
Click Here To View Sources & Evidences