Unrevealed Secrets of Sripada

Click here to edit subtitle

శ్రీపాదుల వారి అతి నిఘూఢ నదీసంగమ స్నానస్థావరం : నివృతి సంగమం
నివృతి సంగమం:
శ్రీ గురుచరిత్ర నందు 8వ అధ్యాయం లో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు తమ 16వ యేట పిఠాపురము నుండి  బయలుదేరి అచ్చట నుండి  అనేక తీర్థక్షేత్రాలలో పర్య టించి, గోకర్ణములో మూడు సంవత్సరాలు ఉండి అటునుండి శ్రీశైలక్షేత్రంలో 4 నెలల పాటు గడిపి , అక్కడ నుండి "నివృతి సంగమం" చేరి అక్కడి కృష్ణ - భీమా నదీ సంగమం లో స్నానమాచరించి కురువపురము లో ప్రవేశించినట్లుగా ఉంటుంది. ఈ కారణం వల్లనే ఈ నదీ సంగమ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలదు. కానీ దురదృష్టవశాత్తు ఈ స్థావరం  రహస్యంగా ఉంచబడినది. చాలామంది శ్రీపాద భక్తులకూ ఈ ప్రదేశం తెలియదు. సరైన వసతి, ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం కుడా దీనికి కారణము. శ్రీపాద వల్లభ (దత్త) భక్తులందరూ చూసి, తప్పక స్నానమాచరించ వలసిన రహస్య దివ్య స్థలమిది. ఈ నదీ సంగమ ప్రాంతమే "నివృతి సంగమమని" శ్రీ విఠలానంద సరస్వతి స్వామివారు క్రీ.శ.2011 లో  వెలుగులోకి తెచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న నేను (కీర్తి వల్లభ) ఆ ప్రాంతాన్ని 2013 మే నెలలో సందర్శించడం జరిగింది. నదీసంగమ ప్రాంతానికి వెళ్ళిన తరువాత అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. అక్కడి నదీసంగమ ప్రదేశం లోని రాళ్ళు సహజ సిద్ధంగా  వినయకుడిలా ఎవరో వచ్చి చెక్కినట్లుగా మలచబడ్డాయి. నదీసంగమ ప్రదేశం లోని  అనేక రాళ్ళు చిన్న చిన్న పాదుకలగా తాయారు చేయబడ్డాయి. నదీసంగమ ప్రదేశం లోని  రాళ్ళలో శ్రీపాదుని పాద ముద్రలు, సహజంగా ఏర్పడిన శివ లింగం, నంది, శంకు, త్రిశూలం , పాము, ఓం కారము, నామము వంటి అనేక ఆనవాళ్ళు లభించాయి. సహజంగా మలచబడిన "సహజ వినాయకులని" మరియు కొన్ని పాదుకల వంటి రాళ్ళను ఏరుకొని భద్రపరుచుకున్నాను. శ్రీపాదుని  పాదముద్రలు చాల పెద్దవిగా ఉన్నవి. అవన్నీ ఎవరో వచ్చి అమర్చినట్లుగా ఉండడం ఆశ్చర్యమే  మరి! శ్రీపాదుని ప్రతీ పాద ముద్ర దాదాపు ఒకటిన్నర అడుగుల నుండి రెండు అడుగుల వరుకు పొడవు ఉన్నాయి. అటువంటి వాటి నన్నింటిని ఫోటోలు తీసి మన వెబ్సైట్ భక్తులందరి కోసం అప్లోడ్ చేస్తున్నాను. అలాగే  నివృతి సంగమం  ఎలా చేరుకోవాలో, అక్కడ ఎవరిని కలవాలో తదితర సమాచారాన్ని మీకు ఇక్కడ ఇస్తున్నాను.
శ్రీ పాద భక్తులందరూ ఈ రహస్య దివ్య నదీసంగమ ప్రాంతాన్ని చూసి, స్నానమాచరించి, మీకు దొరికిన పాదుకల, వినాయకుల వంటి రాళ్ళను సేకరించుకొని శ్రీపాదుని కృపకు పాత్రులగుతారని కోరుకుంటున్నాను. 

-Keerthi Vallabha (May/2013)

విషయము
 వివరణ
ప్రదేశం పేరు
  నివృతి సంగమం
  ఎక్కడ ప్రస్తావించబడినది?
  శ్రీ గురుచరిత్ర లోని 8వ అధ్యాయం నందు
 ఏవిధంగా వెళ్ళాలి?
  సొంత వాహనంలో వెళ్ళవలసి ఉంటుంది . పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం లేదు.
హైదరాబాద్ నుండి రూట్ : శంషాబాద్ --> జడ్చర్ల -->మహబూబ్ నగర్ --> రాయిచూర్ రోడ్డు -->దేవరకద్ర --> మఖ్తల్ --> మగనూర్ --> కృష్ణ స్టేషన్ --> (రైల్వే ట్రాక్ క్రాస్ చెయ్యాలి) --> తంగిడిగి / తంగిడి గ్రామం --> అక్కడ నుండి నదీ సంగమ స్థానమని అడిగి చేరుకోవచ్చు.(తంగిడి గ్రామం నుండి సంగమం 2 కి. మీ.దూరం ఉంటుంది)
 ఎప్పుడు వెళ్ళాలి?
  నదీసంగమ స్థానం లోని రాళ్ళలో గల  శ్రీపాద శ్రీ వల్లభ పాద ముద్రలు, సహజ వినాయకులను అలాగే అక్కడగల వివిధ సహజ రూపాలను చూడాలన్నా, వాటిని సేకరించి తెచ్చుకోవాలన్నా, అలాగే నదీసంగమ స్థానం లో ముంపు భయం లేకుండా స్నాన మాచరించాలన్నా మార్చ్ నెల నుండి జూన్ నెల వరుకు అనుకూల సమయం. మిగతా నెలలలో కృష్ణ - భీమా నదులు ఉధృతంగా ప్రవహించడం వల్ల పైవన్నీ నీటమునిగి ఉంటాయి. అందువల్ల అప్పుడు కేవలం నదీసంగమ స్థానంలో స్నానమాచరించవచ్చు.
  ఎవరిని కలవాలి? / ఎవరు మనల్ని గైడ్ చేయగలరు?
  శ్రీదత్త భీమేశ్వరాలయం (శ్రీ విఠలానంద సరస్వతి స్వామివారి ఆశ్రమం) లో ఉండే తంగిడి రమేష్ గారు - Mobile No. : 09951943835. వారు మాత్రమే నదీసంగమ ప్రాంతం లోని వివిధ దిక్కులలో గల అన్ని శ్రీపాద వల్లభ పాద ముద్రలను మనకు తీసుకుని వెళ్లి చూపించగలరు. మొదటి సారి వెళ్ళే వారు తప్పనిసరిగా వారి సహాయం తీసుకొనడం మంచిది. అలాగే వారికి ముందుగా ఫోన్ ద్వారా సమాచారమివ్వడం మంచిది.
  ఎక్కడ ఉండాలి?
శ్రీదత్త భీమేశ్వరాలయం లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడానికి సౌకర్యాలు ఉన్నాయి (సెకండ్ ఫ్లోర్ లో దత్తాత్రేయుడు, భీమేశ్వర లింగం , వినాయకుడు, సూర్యభగవానుడు, భవానీ మాత, విష్ణు మూర్తి విగ్రహాలతో కూడిన గుడి ఉంటుంది). అన్ని సౌకర్యాలు (విడిది,వసతి,టిఫిను,భోజనం, కాఫీ,టి వంటివి)  పూర్తిగా ఉచితము. 
 అక్కడి ప్రత్యేకతలు
  ఆద్యంతం ప్రత్యేకతలే... 1. శ్రీపాద శ్రీ వల్లభ పాద ముద్రలు 2. ఎటు చూసినా సహజ గణపతులు 3. ఎక్కడ వెతికినా చిన్నచిన్న పాదముల వంటి రాతి నిర్మాణాలు        4. సహజంగా ఏర్పడ్డ నందీశ్వరసహిత శివలింగం 5. సహజంగా ఏర్పడ్డ త్రిశూలం    6. సహజంగా ఏర్పడ్డ పాము 7. సహజంగా ఏర్పడ్డ నామము 8. సహజంగా ఏర్పడ్డ ఓం కారము 9. సహజంగా ఏర్పడ్డ శంకు 10. అనేక సాలగ్రామాల వంటి రాళ్ళు     11. దత్త భీమేశ్వరాలయం 12.అన్నింటికన్నా మిన్నగా దివ్య నదీసంగమ స్నాన ఘట్టము.

మఖ్తల్ నుండి  మగనూర్ దాటిన తరువాత కృష్ణ స్టేషన్  వెళ్ళే దారిలో గల నివృతి సంగమం క్షేత్ర దారిని చూపే బోర్డు
నివృతి సంగమం నదీసంగమ స్థానం లో రాళ్ళ పైగల శ్రీపాద శ్రీ వల్లభుని పాద ముద్ర - 1
నివృతి సంగమం నదీసంగమ స్థానం లో రాళ్ళ పైగల శ్రీపాద శ్రీ వల్లభుని పాద ముద్ర - 2
నివృతి సంగమం నదీసంగమ స్థానం లో రాళ్ళ పైగల శ్రీపాద శ్రీ వల్లభుని రెండు కాళ్ళ పాద ముద్రలు (ఎవరో పేర్చినట్లుగా...)
నివృతి సంగమం నదీసంగమ స్థానం లో రాళ్ళ పైగల శ్రీపాద శ్రీ వల్లభుని రెండు కాళ్ళ పాద ముద్రలు (ఎవరో పేర్చినట్లుగా...) - పైనుండి

వరుసగా  సహజంగా ఏర్పడ్డ నామము, సహజంగా ఏర్పడ్డ త్రిశూలం,  సహజంగా ఏర్పడ్డ పాము, సహజంగా ఏర్పడ్డ శంకు, సహజంగా ఏర్పడ్డ 'ఓం' కారము (ఇవన్ని ఒకే చోట ఏర్పడడం ఆశ్చర్యకరం)

దత్త భీమేశ్వరాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన 'సహజ గణపతులు' మరియు నదీ సంగమ స్థానం లోని ఒక 'సహజ గణపతి'
సహజంగా ఏర్పడ్డ నందీశ్వరసహిత శివలింగం మరియు సహజ గణపతి
నాకు నదీసంగమ స్థానం వద్ద దొరికిన కొన్ని చిన్నచిన్న పాదుకలవంటి రాతి నిర్మాణాలు మరియు చలువరాయి (మార్బుల్) సహజ గణపతి
నాకు నదీసంగమ స్థానం వద్ద దొరికిన, చుట్టూరా సాదారణ రాయిని పోలి మధ్యలో మార్బుల్ ను కలిగిన సాలగ్రామం వంటి నిర్మాణము