Unrevealed Secrets of Sripada

Click here to edit subtitle

Sripada Sri Vallabha - Vallabhapuram (ManthanGoud Village)
శ్రీపాద వల్లభుడు - వల్లభాపురం (మంథన్‌గౌడ్ గ్రామం)

Published On April 2012

Nearest Pushkar Ghats To ManthanGoud Village

Pushkar Ghats Close To ManthanGoud Dattatreya - Sripada Temple
Vittal Baba Ashramam Pushkar Ghat - Sripada Sri VallabhaPuram
 Deosugur Railway Bridge Pushkar Ghat
 Tangidigi Village (Near Krishna Station) Pushkar Ghat
 Atukur Pushkar Ghat
 Kuruvapuram Pushkar Ghat
 Pasupula Pushkar Ghat
మంథన్‌గౌడ్ (వల్లభాపురం) ప్రాముఖ్యత ఏంటి?
  • క్రీ.శ.1351-1352 సంవతరాల్లో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు వల్లభేశుడు అనే పసుపు వర్తక బ్రాహ్మణుడిని దొంగల నుండి రక్షించి కాపాడిన ప్రదేశమిది.
  • శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు క్రీ.శ. 1350 లో కృష్ణానదిలో అంతర్హితం అయిన తరువాత మొదటి సారిగా తిరిగి భక్త రక్షణ కోసం కనిపించిన ప్రదేశమిది.
  • శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి పాదుకలు పిఠాపురంలో ఉంటే, శ్రీపాదుల పాదుకలతో పాటూ వారి హస్త ముద్రలు నేటికి మంథన్‌గౌడ్ లో చూడవచ్చు.
  • శ్రీ చరణుల వారి హస్త ముద్రలు గల ఏకైక ప్రదేశమిది.
  • వల్లభేశుడు స్వయంగా ప్రతిష్టించిన శ్రీపాద పాదుకలు కల ప్రదేశమిది.
  • ప్రతిష్టించిన పాదుకలలో అతి పురాతనమైన శ్రీపాద పాదుకలు కల ప్రదేశమిది
  • ప్రతీ పౌర్ణమి, అమావాస్యలందు దత్త హోమాలు, ప్రతీ అష్టమి నందు అనఘాస్టమీ వ్రతాలు, ప్రతీ శనివారం ప్రదోష సమయంలో ప్రదోష పూజలు జరిగే దివ్య స్థలమిది.
మంథన్‌గౌడ్ స్థల పురాణం
శాసనాలను బట్టి , ఇతర ఆధారాలను బట్టి మంథన్‌గౌడ్ గ్రామం యొక్క పురాతన నామం 'మహనీయపురం' గా తెలుస్తోంది. మహనీయపురం దట్టమైన అడవిలో ఉన్న ఒకానొక అతిచిన్న గ్రామం, మరియు పంచదేవపహాడ్ కు దగ్గరలో గల 'పసుపుల' గ్రామమును త్వరగా చేరుకొనుటకు వెళ్ళే అడ్డదారిలో గల అతిచిన్న గ్రామము.
1350 వ సంవత్సరం లో ఆ ప్రాంతమంతా దట్టమైన గడ్డితో కూడిన అటవీప్రాతంగా తెలుస్తోంది. 1350 కు ముందు, తరువాత  మహనీయపురం ప్రజల ప్రధాన
ఆదాయవనరు 'వెన్నపూస' అమ్మకం (పాల నుండి వెన్నను తీయడం). అక్కడ గల అనేక మంది గౌడ కులస్తులు వెన్నపూస ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మేవారు. ఈ విధంగా పాల నుండి వెన్నను తీసే ప్రక్రియను 'మంథన్‌' (मन्थन) అని ఉర్దూలో అనేవారు (Manthan = The Churning). క్రమక్రమంగా మహనీయపురం మంథన్‌గౌడ్ గా మార్పు చెందింది. అయితే 1351-1352 సంవత్సరాలలో వల్లభేశ వృత్తాంతం జరిగిన దరిమిలా ఈ ప్రాతాన్నే 'వల్లభాపురం' అని కుడా పిలిచేవారు. అయితే 'వల్లభాపురం' అనే పేరు వల్లభేశ వృత్తాంతం జరిగినందువల్ల (వల్లభేశుడి పేరుమీద) వచ్చిందా? లేక 'శ్రీ వల్లభస్వామి' వారు తిరిగి ఇక్కడ కనిపించడం వల్ల వచ్చిందా? అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకలేదు. కొన్ని మరాఠి గురుచరిత్ర పుస్తకాలలో 'మంథన్‌గౌడ్' ను 'మంథన్‌గుడి' అని ప్రస్తావించడం జరిగింది.
మంథన్‌గౌడ్ ఎక్కడుంది? - ఎలా వెళ్ళాలి?
మంథన్‌గౌడ్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ నుండి 9 కీ.మీ. దూరంలో కలదు. కురువపురం వెళ్ళేవారు మార్గమధ్యలో మంథన్‌గౌడ్ గ్రామం లో గల ఈ దివ్య చారిత్రాత్మక ప్రదేశాన్ని సులభంగా దర్శించుకోవచ్చు.

హైదరాబాద్ నుండి రూట్ : ఆరాంఘర్ -X- రోడ్స్ ---->శంషాబాద్ ---->జడ్చర్ల ---->మహబూబ్ నగర్ ---->రాయిచూర్ రోడ్డు ---->దేవరకద్ర --->జక్లేర్ ----> మక్తల్ కు 1 కీ.మీ. ముందు (వెళ్ళేటప్పుడు) ఎడమ చేతి వైపు వచ్చే అడ్డరోడ్డు తీసుకుని మంథన్‌గౌడ్ గ్రామం చేరాలి.
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లో 18వ అధ్యాయం లోని వల్లభేశుని వృత్తాంతం
వల్లభేశుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన యెడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేషధనమును సంపాదించెను. అయితే మ్రొక్కు తీర్చుటకు వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదులవారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్తరూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమున్నవి. అతడు ధనమును తీసికొని కురుంగడ్డకు వచ్చుచుండగా నలుగురు దొంగలు యాత్రికులవేషమున యితనితో కలసి వచ్చి వల్లభేశుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయములో శ్రీపాద వల్లభులను స్మరించెను. శ్రీపాదుల వారు త్రిశూలధారి అయిన యతిరూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించెను. నాలుగవవాడు తానెన్నడు దొంగతనం కూడా చేయలేదనియూ, ఈ ముగ్గురు దొంగలును మార్గమధ్యంలో తనని కలిసినారనియూ, ప్రలోభపరచెడి వారి మాటలకు లోనయి వారితో కుమ్మక్కయినాననియు, తనను రక్షించవలసినదనియూ, వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి, కొంచెం విభూతిని ప్రసాదించి, వల్లభేశుని శరీరంపై చల్లమనియూ, వాని తలనూ, మొండెమునూ అతికించ వలసినదనియూ  ఆజ్ఞాపించిరి. శ్రీపాదుల అమృతదృష్టి వలన వల్లభేశుడు పునరుజ్జీవితుడయ్యెను. ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయునూ వల్లభేశుడు తెలిసికొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శనభాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేశుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేశుడు తన తప్పు తాను తెలిసికొనెను. వేయిమ్రంది బ్రాహ్మణ్యమునకు అన్నసంతర్పణ చేయుశక్తి తనకు చాలాకాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతలో నాలుగువేల మందికైననూ సునాయాసముగా అన్నసంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి యిక్కట్లను కొనితెచ్చుకొన్నందులకు ప్రతిగా నాలుగువేల మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్నసంతర్పణ చేయించెను.
గురుచరిత్ర లో వివరించబడిన  వల్లభేశ వృత్తాంతము (అధ్యాయం 10)
మంథన్‌గౌడ్ దేవాలయ సమాచారం
దత్తదీక్షలు, సన్యాసదీక్షలు, యోగదీక్షలు, ఔదుంబరదీక్షలు ఇచ్చే మరియు అనఘాస్టమీ వ్రతాలు, దత్తహోమాలు, శని ప్రదోష పూజలు జరిపే ఏకైక దివ్య దత్తక్షేత్రం ఇది. వివరాలకు, పూజలకు క్రింది వారిని సంప్రదించండి

Sri. K. Krishnaiah Goud (President - Dattatreya Devalaya Committee) - Mobile # 09959903893
Sri N. Srinivasa Reddy (Officer - Dattatreya Devalaya Committee) - Mobile # 09908391284
Temple Purohit (Marathi Purohit) - Mobile # 09849625527

సన్యాసదీక్ష, ఔదుంబరదీక్ష, దత్తదీక్షలు, యోగదీక్షలు తీసుకోవడం లో గైడెన్స్ కోసం క్రింది వారిని సంప్రదించండి

Sri Vijaya Bhaskar - Mobile # 08331845737

మంథన్‌గౌడ్ లో జరిగిన వల్లభేశ వృత్తాంతం ను తెలిపే చిత్ర పటములు
మంథన్‌గౌడ్ దేవాలయంలో గల వల్లభేశ వృత్తాంతం ను తెలుపు చిత్ర పఠము
కురువపురం దేవాలయంలో గల వల్లభేశ వృత్తాంతం ను తెలుపు చిత్ర పఠము
మరాఠి గురుచరిత్ర లో  గల వల్లభేశ వృత్తాంతం ను తెలుపు చిత్ర పఠము
18-10-1971వ సంవత్సరం , ఆశ్వీయుజ మాస దీపావళి , సోమవారం  ప్రచురితమైన తెలుగు గురుచరిత్ర లోని 10వ అధ్యాయం లోని వల్లభేశ వృత్తాంతమును తెలిపే పటము

Vallabhapuram Temple Photos (ManthanGoud Temple Photos)

వల్లభాపురం గుడి ఫోటోలు (మంథన్‌గౌడ్ గుడి ఫోటోలు )

మంథన్‌గౌడ్ దత్తాత్రేయ గుడి ప్రాంగణం
ముసివేయబడ్డ దక్షిణ ద్వారం
వల్లభేశ వృత్తాంతం జరిగిన ప్రాంతం
మంథన్‌గౌడ్ దత్తాత్రేయ గుడి
మంథన్‌గౌడ్ దత్తాత్రేయుడు
శ్రీపాదుని హస్త ముద్రికలు
శ్రీపాదుని హస్త ముద్రికలు

ముఖ్య గమనిక

ఇంతటి చారిత్రాత్మక, దివ్య ప్రదేశమైన ఈ మంథన్‌గౌడ్ దేవాలయం నందు శ్రీపాద శ్రీ వల్లభుల వారి విగ్రహం లేకపోవడం కొంత వెలితిగానే ఉంది. (కురువపురంలో మర్రిచెట్టు క్రింద శ్రీపాదుల వారి పాలరాయి విగ్రహం కలదు), విగ్రహదాతలు ఎవరినా ముందుకొస్తే వెంటనే వారి స్వహస్తాలతోనే ప్రతిష్టించడానికి ఎలాంటి అభ్యంతరంలేదని ఈసందర్భంగా మన ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. శక్తి గల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా శ్రీపాదుల వారి తరఫున మా ప్రార్ధన. ఇతర వివరాలకు దయచేసి 09948882498 నెంబర్ కు సంప్రదించండి .

కొసమెరుపు

మహారాష్ట్ర మరాఠి దత్తభక్తులు మంథన్‌గౌడ్ ను "శ్రీక్షేత్రం" తో పిలుస్తారు. వారు ఈ ప్రాంతాన్ని "శ్రీక్షేత్ర మంథన్‌గుడి" అని అంటారు. కాని మనరాష్ట్రం లో ఉన్నవారికి, చాలా మంది దత్తభక్తులకు కుడా  అసలు మంథన్‌గౌడ్ ఉందనే తెలియదు.

Photos of Sripada Sri Vallabha Vigraha Pratista In ManthanGoud Village On 27/March/2014 By Sripada Sri Guru Sangamam Seva Trust 

మహారాష్ట్ర మరాఠి దత్తభక్తులు "శ్రీక్షేత్ర మంథన్‌గుడి" అనే పేరుతో మరాఠి లో 'మంథన్‌గౌడ్' ప్రాచుర్యాన్ని తెలుపుతూ ప్రచురించిన కరపత్రం