Unrevealed Secrets of Sripada

Click here to edit subtitle

వాయససహిత (కాకి) దత్తాత్రేయ ఆలయం ఎక్కడ ఉందో  మీకు తెలుసా?
సాధారణంగా దత్తాత్రేయుని విగ్రహం తో పాటు ఒక కామధేనువు(ఆవు) మరియు నాలుగు శరమములు (కుక్కలు) ఉంటాయి. కాని ప్రపంచములో ఒక్కచోట మాత్రమే వాయససహిత (కాకి) దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆ చోటే మధ్యప్రదేశ్ లోని  ఇండోర్ టౌన్ లో ఉన్న నారాయణ్ బాగ్ దత్తమందిర్. ఈ వాయససహిత  దత్తాత్రేయుని ఆలయం 700 సంవత్సరాలనాటిదని చెపుతారు. ఇండోర్ కేంద్రంగా చేసుకుని పరిపాలించిన హోల్కార్ రాజుల కాలానికి ముందే ఈ ఆలయం ఉన్నట్లు చరిత్ర చెపుతోంది. . ఆది శంకరాచార్యులువారు సైతం తన శిష్య బృందంతో కలిసి ఈ ఆలయానికి వేంచేసినట్లు చరిత్ర చెపుతోంది. ఇక్కడ గురు దత్తాత్రేయ విగ్రహంతోపాటు ఓ కాకి, నాలుగు కుక్కలు మనకు దర్శనమిస్తాయి. దత్తాత్రేయుని ప్రక్కనే ఉండే కాకి భూమికి ప్రతీక అనీ, నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు చిహ్నాలని ఇక్కడి శాసనాలలో చెప్పబడ్డాయి.
దత్తాత్రేయుడు ఏ గ్రంధానికి గ్రంథకర్త?
 దత్తాత్రేయుడు 'త్రిపుర రహస్య' గ్రంథకర్తగా పేరు పొందాడు, ఈ గ్రంధం అద్వైత వేదాంతాన్ని విశదీకరిస్తుంది.
దత్తాత్రేయుడు తాను రచించిన గ్రంధాన్ని ఎవరికి అంకితం చేశాడు?
దత్తాత్రేయుడు 'త్రిపుర రహస్య' గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు.
ముస్లిం మతస్థులు పూజారులుగా ఉన్న దత్తమందిరమేది? ఎక్కడుంది?
కర్నాటక లోని చిక్ మంగుళూరు జిల్లాలోగల బాబాబుడంగిరి దత్తపీఠం. ఇక్కడ దత్తాత్రేయుడు ముస్లిం పూజారుల (ఇమామ్) ద్వారా పూజలందుకుంటాడు.